Wednesday, 17 December 2025 03:17:32 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

The Birthday Boy : ఆహా ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

Date : 12 August 2024 11:16 AM Views : 181

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : The Birthday Boy : వారం వారం కొత్త సినిమాలు, షోలతో తెలుగు ప్రేక్షకులని పలకరిస్తున్న తెలుగు ఓటీటీ ఆహాలోకి ఇప్పుడు మరో కొత్త సినిమా వచ్చింది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో పలువురు కొత్తవాళ్లతో తెరకెక్కిన ‘ది బర్త్‌డే బాయ్‌’ సినిమా ఐటీవల జులై 19న థియేటర్స్ లోకి వచ్చింది. బొమ్మ బొరుసా బ్యానర్ పై ఐ.భరత్‌ నిర్మాణంలో విస్కీ దాసరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అమెరికాలో పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో బర్త్ డే బాయ్ అనుకోకుండా చనిపోతే ఏం జరిగింది, అది మర్డర్ అని తెలిసిన తర్వాత ఏం జరిగింది అనే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ది బర్త్‌డే బాయ్‌ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా బిగ్ ఫిష్ సంస్థ ద్వారా ఆహాలో రిలీజయింది. థియేటర్స్ లో మిస్ అయితే ఓటీటీలో కచ్చితంగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని చూడండి. ఇక ది బర్త్‌డే బాయ్‌ సినిమా కథ విషయానికొస్తే.. బాలు(విక్రాంత్), అర్జున్(మణి), వెంకట్(రాజా అశోక్), సాయి(రాహుల్), సత్తి(అరుణ్) అయిదుగురు చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ అమెరికాలో ఒకే ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. బాలు పుట్టిన రోజు నాడు పీకల దాకా తాగి బర్త్ డే బంప్స్ పేరుతో అతనిపై దాడి చేసి అల్లరి చేస్తుండటంతో ఈ క్రమంలో బాలు చనిపోతాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ నలుగురు అమెరికాలో ఉండే అర్జున్ అన్నయ్య భరత్(రవికృష్ణ)కు ఈ విషయం చెప్తారు. అమెరికాలో స్ట్రిక్ట్ రూల్స్, బాడీని ఇండియాకు కూడా తీసుకెళ్ళలేము, తెలిస్తే అందరి జీవితాలు పోతాయి అని ఇండియాలో ఉన్న బాలు పేరెంట్స్ ని అమెరికాకి పిలిపిస్తారు. వాళ్ళుండే ఇంటి రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్న ప్రవీణ్(సమీర్ మళ్ల) ఇది మర్డర్ అని అనుమానిస్తాడు. అసలు బాలు ఎలా చనిపోయాడు? బాలుది హత్య లేకా అనుకోకుండా జరిగిందా? బాలు కథేంటి? ప్రవీణ్, భరత్ కలిసి ఆ నలుగురు ఫ్రెండ్స్ ని కాపాడటానికి ఏం చేసారు తెలియాలంటే సినిమా చూసేయండి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :