Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు మహేశ్ బాబు. ఈ మేరకు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ’18వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సమయాన్ని ఆస్వాదించు. అలాగే నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. నీకు తండ్రిని అయినందుకు చాలా గర్వంగా ఉంది.’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. అలాగే మహేశ్ సతీమణి నమ్రత శిరోధ్కర్ సైతం తన తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కొత్త ప్రారంభాలకు! పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ రోజు నీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అలాగే తల్లిదండ్రులుగా మేము గర్వపడే రోజు. నీవు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండూ.’ అని నమత్రా రాసుకొచ్చింది.
Admin
Studio18 News