Saturday, 07 March 2026 08:24:58 PM
# కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా

Ram Charan : గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్ హీరో

Date : 16 August 2024 01:52 PM Views : 447

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ram Charan : భార‌తీయ చిత్ర స్థాయిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన మూవీ ఆర్ఆర్ఆర్‌. ఈ మూవీతోనే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌ను ప‌లువురు హాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌శంసించారు. తాజ‌గా ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో కూడా రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న అద్భుతం అని, ఎంట్రీ, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో చాలా బాగా న‌టించార‌న్నారు. ఎమిలీ ఇన్ పారిస్‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో భార‌తీయ‌ సినిమాల్లో మీకు నచ్చిన న‌టుడు ఎవ‌రు అనే ప్ర‌శ్న లూకాస్‌కు ఎదురైంది. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్‌లో ప్ర‌ధాన పాత్ర పోషించిన రామ్‌చ‌ర‌ణ్ అద్భుత న‌టుడు అని చెప్పారు. ఎంట్రీ సీన్‌, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో చాలా బాగా న‌టించాడ‌ని చెప్పుకొచ్చారు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లోనూ ఆక‌ట్టుకున్నార‌న్నారు. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా 2022లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ద‌ర్శ‌క‌దీరుడు డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. 1300 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. అంతేనా అస్కార్ అవార్డు ను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీలో న‌టిస్తున్నారు. కియారా అద్వాణి హీరోయిన్ కాగా అంజ‌లి, శ్రీకాంత్, సునీల్ లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :