Sunday, 08 March 2026 09:55:38 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Pushpa 2 : ‘పుష్ప-2’ నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. క్లైమాక్స్ గూస్‌బంప్స్‌..

Date : 05 August 2024 02:34 PM Views : 281

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pushpa 2 climax shooting : ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప-2’. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. పుష్ప సినిమాకి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ మూవీ డిసెంబ‌ర్ 6న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. తాజాగా చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. భారీ వ్య‌యంతో నిర్మించిన ఓ సెట్‌లో ప‌తాక స‌న్నివేశాల‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలిపింది. హీరో బ‌న్నీతో పాటు కీల‌క న‌టులు అంతా ఇందులో పాల్గొంటున్నారు. క్లైమాక్స్ స‌న్నివేశాలు అద్భుతంగా వ‌స్తున్నాయ‌ని, థియేట‌ర్ల‌లో వీటిని చూస్తే అభిమానుల‌కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయ‌ని చెబుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్ లు నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంధాన హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. అన‌సూయ‌, సునీల్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజర్‌, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :