Monday, 19 January 2026 08:23:24 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Suriya: షూటింగ్‌లో హీరో సూర్యకు గాయం.. నిర్మాత వివరణ

Date : 10 August 2024 11:54 AM Views : 223

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య తన 44వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. మూవీ చిత్రీకరణ సందర్భంగా సూర్య తలకు స్వల్ప గాయం అయింది. ఈ ఘటనపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సినీ నిర్మాత పాండ్యన్ స్పందించారు. సూర్య తలకు స్వల్ప గాయమే అయిందని తెలిపారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలో ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. కాగా, ‘సూర్య 44’ చిత్రీకరణ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా కథాంశంతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తుండగా.. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌ రాజశేఖర్ కర్పూరసుందర పాండ్యన్, కార్తికేయ సంతానం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. జోజు జార్జ్, కరుణాకరన్, జయరామ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను శ్రేయాస్ కృష్ణ నిర్వహిస్తుండగా సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :