Sunday, 08 March 2026 03:43:00 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Raj Tarun : రేపే రాజ్ తరుణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. మీడియా ముందుకు వస్తాడా?

Date : 22 July 2024 03:08 PM Views : 343

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Raj Tarun : రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘పురుషోత్తముడు’ సినిమా జులై 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో పురుషోత్తముడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా.. లాంటి చాలా మంది స్టార్స్ నటించారు. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ ఓ కేసు వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబార్షన్ చేయించి ఇప్పుడు మోసం చేసాడని ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు. గత వారం రోజులుగా ఈ వివాదం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కి కూడా వచ్చేలా లేడు. ఆల్రెడీ తన ఫోన్ నంబర్ కూడా మార్చేశాడు.అయితే ఈ వివాదం మొదలయ్యాకే పురుషోత్తముడు సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం గమనార్హం. రాజ్ తరుణ్ అలా కేసులో ఇరుక్కోవడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు. కానీ రిలీజ్ ముందు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. రేపు జులై 23 ఉదయం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చర్చగా మారింది. రాజ్ తరుణ్ లేకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారా? రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా? రాజ్ తరుణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాని ఫేస్ చేస్తాడా? అని అందరిలోనూ సందేహం ఉంది. ఈ వివాదం మొదలయ్యాక ఒకేఒకసారి రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చాడు. అప్పట్నుంచి మళ్ళీ రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ వివాదం గురించి తెలుసుకోడానికి మీడియా నుంచి రాజ్ తరుణ్ కి ఫోన్స్, మెసేజ్ లు తెగ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ మీడియా ముందుకు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా అనేది డౌటే. రాజ్ తరుణ్ రేపు పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా లేదా చూడాలి మరి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :