Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : HIT 3 – Nani : ‘సరిపోదా శనివారం’ మూవీ విజయం సాధించడంతో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం పుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా థియేటర్‌లో ఉండగానే కొత్త మూవీని ప్రకటించాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3లో నటిస్తున్నాడు. నాని కెరీర్‌లో 32వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నట్లు చెప్పేశారు. ఇందుకు సంబంధించిన ఓ చిన్న టీజర్‌ను విడుదల చేశారు. ఇది నాని ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. అంతేకాదండోయ్.. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది (2025) మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా.. గతంలో హిట్ సిరీస్‌లో రెండు చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, హిట్-2లో అడివి శేష్ నటించారు. ఇక తాజాగా హిట్-3లో నాని నటిస్తున్నారు.
Admin
Studio18 News