Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ravi Teja discharged : మాస్ మహారాజా రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మెసేజ్‌లు చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు. ‘సర్జరీ విజయవంతంగా పూర్తైంది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు, మద్దతుకు కృతజ్ఞతలు. త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాను.’ అని రవితేజ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన కొత్త సినిమా షూటింగ్‌లో రవితేజ గాయపడ్డాడు. RT 75 వర్కింగ్ టైటిట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ కుడి చేతికి గాయమైంది. అయితే.. గాయాన్ని లెక్కచేయకుండా రవితేజ షూటింగ్‌లో పాల్గొనడంతో అది తీవ్రమైంది. ఆస్పత్రికి వెళ్లగా శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. కోలుకున్న అనంతరం తిరిగి రవితేజ షూటింగ్‌లో అడుగుపెట్టనున్నాడు.
Admin
Studio18 News