Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mahesh babu birthday : ఫ్యాన్స్‌ను ఉద్దేశించి సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. శుక్రవారం (ఆగస్టు 9) మహేశ్ బర్త్ డే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆయన శుభాకాంక్షలు పోటెత్తాయి. ఈ క్రమంలో తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా మీరు పంపించిన సందేశాలు, చూపించిన ప్రేమాభిమానాలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయినట్లు చెప్పారు. తనకు ఎంతో స్పెషల్ డే అయిన బర్త్‌డేని మరింత ప్రత్యేకంగా మార్చేశారని అన్నాడు. ప్రతి సంవత్సరం మీరు చూపించే ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. లవ్ యూ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహేశ్ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు లవ్ యూ అన్నా అని కామెంట్లు చేస్తున్నారు. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా థియేటర్లలో మురారీ సినిమా రీరిలీజ్ అయింది. సినిమా చూసిన తరువాత థియేటర్ల వద్దనే కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గుంటూరు కారంతో సాలీడ్ హిట్‌ను అందుకున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం ఆయన తన నెక్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నారు. దర్శకదీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆయన నటించనున్నాడు. మహేశ్ కెరీర్‌లో 29వ సినిమాగా ఇది రూపుదిద్దుకోనుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు, ఇందులో విదేశీ నటులు సైతం కనిపించే అవకాశం ఉన్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి మహారాజ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Admin
Studio18 News