Sunday, 15 March 2026 09:54:05 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Ram Pothineni : డబల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఎంతలా కష్టపడ్డాడో.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Date : 12 August 2024 10:36 AM Views : 203

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ram Pothineni : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోల్లో రామ్ ఒకరు. ప్రతి సినిమాకి చాలా కష్టపడతాడు. తన ఎనర్జీని అంతా సినిమాలో చూపిస్తాడు. రామ్ ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమాతో రాబోతున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం రామ్ బాగా కష్టపడ్డాడు. డబల్ ఇస్మార్ట్ ముందు స్కంద సినిమా లుక్ నుంచి మళ్ళీ సిక్స్ ప్యాక్ లుక్ లోకి రావడానికి ఫుల్ గా డైట్ చేసి, జిమ్ లో కష్టపడి రామ్ డబల్ ఇస్మార్ట్ కి కావాల్సిన సిక్స్ ప్యాక్ లుక్ తీసుకొచ్చాడు. డబల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ లో రామ్ తన సిక్స్ ప్యాక్ చూపిస్తాడని తెలిసిందే. ఆ మేకోవర్ కోసం రామ్ చాలా నెలలు కష్టపడ్డానని తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. రామ్ తాజాగా డబల్ ఇస్మార్ట్ కోసం తన బాడీ మేకోవర్ మొదలుపెట్టినప్పటినుంచి కావాల్సిన లుక్ వచ్చేదాకా ఉన్న పలు ఫోటోలు షేర్ చేసి.. డబల్ ఇస్మార్ట్ కోసం మంచి ఫుడ్ తిని, న్యాచురల్ గా జిమ్ చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక రామ్ లేడీ ఫ్యాన్స్ అయితే సిక్స్ ప్యాక్ లో రామ్ ఏమున్నాడబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ్ డబల్ ఇస్మార్ట్ కోసం ఫిజికల్ గా కూడా బాగానే కష్టపడ్డాడు అని తెలుస్తుంది. మరి ఇస్మార్ట్ శంకర్ ని మించి డబల్ ఇస్మార్ట్ హిట్ అవుతుందా చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :