Sunday, 15 March 2026 11:21:45 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Janvi Kapoor: ఆసుపత్రి నుంచి బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ డిశ్చార్జ్

Date : 21 July 2024 11:52 AM Views : 299

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 18న ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటి జాన్వీకపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె సోదరి ఖుషీకపూర్, బాయ్‌ఫ్రెండ్ షిఖార్ పహారియా పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. 18న ఆమె నీరసంగా ఉండడంతోపాటు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె ఫుడ్ పాయిజన్‌‌కు గురైనట్టు తెలిపారు. ఇప్పుడామె కోలుకుని ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జాన్వీ కపూర్ ఇటీవల బాయ్‌ఫ్రెండ్ షిఖార్‌తో కలిసి అనంత్ అంబానీ-రాధిక వివాహానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ నటిస్తోంది. అలాగే, రామ్ చరణ్ తదుపరి సినిమాకు కూడా ఆమె ఎంపికైంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :