Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sai Pallavi Sister Marriage : సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ కూడా అక్కలాగే ఉంటుందని తెలిసిందే. పూజ కన్నన్ ఓ తమిళ సినిమాలో మెయిన్ లీడ్ లో కూడా నటించింది. ఇటీవల కొన్ని నెలల క్రితం పూజ కన్నన్ కు తను ప్రేమించిన అబ్బాయి వినీత్ తో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థాన్ని గ్రాండ్ గా చేసారు. పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలు ఆ సమయంలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా సైలెంట్ గా కేవలం ఫ్యామిలీ, సన్నిహితుల మధ్యే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ పెళ్లి జరిగింది. నేడు ఉదయం పూజా కన్నన్ – వినీత్ పెళ్లి జరిగినట్టు సమాచారం. నిన్న హల్దీ ఈవెంట్ ఫొటోలు, సంగీత్ వీడియోలు వైరల్ అవ్వగా నేడు ఉదయం నుంచి సోషల్ మీడియాలో పూజా కన్నన్ – వినీత్ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి దగ్గరుండి చెల్లి పెళ్లి చేయిస్తుంది. చెల్లి పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ హంగామా చేస్తుంది. సంగీత్ లో చెల్లితో కలిసి అదిరిపోయే డ్యాన్స్ కూడా చేసింది. ఇక ఎప్పుడూ పద్దతిగా కనిపించే సాయి పల్లవి చెల్లి పెళ్ళిలో కూడా అలాగే పద్దతిగా కనిపించి అలరించింది. ప్రస్తుతం పూజా కన్నన్ – వినీత్ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. మరి చెల్లి పెళ్లి దగ్గరుండి చేసిన సాయి పల్లవి తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి.
Admin
Studio18 News