Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Stree 2 collections : బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ చిత్రం స్త్రీ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ హారర్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లను సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలో కూడా ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం 9వ రోజు భారత్‌లో సుమారుగా 17 కోట్ల రూపాయలు కలెక్ట్ వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం ఇండియాలోనే 300 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించి అరుదైన మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని సినీ విమర్శకుడు, వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. 300 నాట్ అవుట్ అంటూ కామెంట్ చేశాడు. బుధవారం ప్రివ్యూలు రూ 9.40 కోట్లు, గురువారం రూ 55.40 కోట్లు, శుక్రవారం రూ 35.30 కోట్లు, శనివారం రూ 45.70 కోట్లు, ఆదివారం రూ 58.20 కోట్లు, సోమవారం రూ 38.40 కోట్లు, మంగళవారం రూ 26.80 కోట్లు, బుధవారం రూ 20.40 కోట్లు, గురువారం రూ 18.20 . మొత్తం : రూ 307.80 కోట్లు అని తెలిపాడు.
Admin
Studio18 News