Saturday, 24 January 2026 01:31:47 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Nagababu : మీడియా రంగంలోకి నాగబాబు.. జనసేనకు కలిసొస్తుందా..?

Date : 10 August 2024 10:52 AM Views : 251

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nagababu : మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో, టీవీలో నిర్మాతగా, నటుడిగా ఎన్నో సినిమాలు, టీవీ షోలు చేసారు. కానీ గత కొన్నాళ్లుగా పూర్తిగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటూ జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపులో నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నాగబాబు మీడియా రంగంలోకి రాబోతున్నారు. ఆల్రెడీ నాగబాబు గతంలోనే పలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, కామెడీ షోలు చేసారు. అయితే తాజాగా N మీడియా అంటూ నాగబాబు మీడియా రంగంలోకి వస్తున్నాను అని ప్రకటించారు. N మీడియా లోగో రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు. తన పాత యూట్యూబ్ ఛానల్ కి N మీడియా ఎంటర్టైన్మెంట్స్ అని పేరు మార్చి సరికొత్తగా ప్రారంభించారు. ప్రస్తుతానికి N మీడియా కేవలం ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, పలు ఇంటర్వ్యూలు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మాత్రమే కంటెంట్ ఇవ్వనున్నారు. అయితే భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ తో పాటు ఒక వెబ్ సైట్ కూడా స్థాపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటినుంచి N మీడియాని స్థాపించి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు జనసేనకు సపోర్ట్ గా ఉండేలా చూసుకుంటారేమో అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం యూట్యూబ్ ఛానల్, వెబ్ సైట్ తో ఆగుతారా శాటిలైట్ ఛానల్ కూడా పెడతారా, జనసేనకు N మీడియా కలిసొస్తుందా అని టాలీవుడ్ లో చర్చగా మారింది. మొత్తానికి జనసేన గెలుపు తర్వాత నాగబాబు సరికొత్తగా ఏదో ప్లాన్ చేయబోతున్నారని మాత్రం తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :