Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఖాయమైంది. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నాడు. నేడు (సెప్టెంబర్ 6) మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. దీంతో నందమూరి అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మొదటి సినిమాకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సినీ రంగంలో అడుగుపెడుతున్న మోక్షజ్ఞకు అభినందనలు తెలియజేశారు. ‘సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో మీకు అన్ని దైవిక శక్తులతో పాటు తాతగారి ఆశీర్వాదంతో ఉంటుంది.’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అదే సమయంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు మోక్షజ్ఞ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నందమూరి కల్యాణ్ ట్వీట్ చేశాడు.
Admin
Studio18 News