Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : am Charan – Niharika : నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలుపుతుంది నిహారిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్, చరణ్ కూతురు క్లిన్ కారా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిహారిక మాట్లాడుతూ.. క్లారా మా అందరికి గోల్డెన్ డార్లింగ్. మా చరణ్ అన్నని కారా ముప్పు తిప్పలు పెడుతుంది. ఆమెకు ఫుడ్ తినిపించడానికి చాలా కష్టాలు పడాలి. చరణ్ అన్నే అన్ని చూపిస్తూ తినిపిస్తారు. నేను చూసిన గొప్ప ఫాదర్స్ లో చరణ్ అన్న ఒకరు. నేను చూసిన వాళ్ళల్లో బెస్ట్ ఫాదర్. స్టార్ హీరోగా బిజీగా ఉన్నా కారాతో కలిసి ఉండటానికి టైం ఇస్తాడు. ఎలాంటి స్ట్రెస్ లేకుండా పాపతో గడపడానికి టైం సెట్ చేసుకుంటాడు. అసలు చరణ్ అన్నని అలా చూస్తే పనిపాట లేక ఖాళీగా ఉండి పాప దగ్గర ఉంటున్నాడేమో అనిపిస్తుంది అని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఇప్పటికే బెస్ట్ కొడుకుగా, హీరోగా, భర్తగా సక్సెస్ అయిన చరణ్ ఇప్పుడు ఫాదర్ గా కూడా సక్సెస్ అవుతున్నాడు అని అభినందిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ కూడా క్లిన్ కారా గురించి మాట్లాడుతూ.. పాపని వదిలి వెళ్ళడానికి నాకు కష్టంగా ఉంటుంది. క్లిన్ కారాకు నేను బానిస అయిపోయాను. షూటింగ్స్ కి వెళ్తే తనని నేను మిస్ అవుతున్నాను. నా కూతురికి సమయం ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకే లోకల్ లో షూటింగ్ ఉంటే మాత్రం సాయంత్రం 6 గంటలకు పూర్తి చేసేసి వచ్చి నా కూతురితో గడుపుతాను. నా కూతురికి ఎక్కువ సమయం ఇచ్చేలా నా వర్క్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటాను. క్లిన్ కారా స్కూల్ కి వెళ్లేవరకు స్లోగా సినిమాలు చేస్తాను అని తెలిపాడు.
Admin
Studio18 News