Saturday, 07 March 2026 08:01:56 PM
# ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..?

Pawan Kalyan – Nidhhi Agerwal : పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్.. హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్..

Date : 17 August 2024 11:14 AM Views : 233

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan – Nidhhi Agerwal : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో చేతిలో ఉన్న మూడు సినిమాలు కొన్నాళ్ళు పక్కన పెట్టారు. ఇటీవల పవన్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ ఎలాగైనా వాటికి డేట్స్ ఇచ్చి ఆ మూడు సినిమాలు పూర్తిచేస్తానని తెలిపారు. దీంతో పవన్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పవన్ కెరీర్ లో మొదటి పీరియాడిక్ సినిమాగా హరిహర వీరమల్లు ఎప్పుడో మొదలుపెట్టారు. కానీ అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఇటీవల మళ్ళీ రెగ్యులర్ షూట్ మొదలుపెట్టింది. ఆగస్టు 14 నుంచి హరిహర వీరమల్లు భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో జాయిన్ అవుతాడని నిర్మాతలు నిన్నే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నిధి ఓ మహారాణి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా నేడు నిధి అగర్వాల్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో నిధి అగర్వాల్ మహారాణిలా నిండుగా ఆభరణాలతో రెడీ అయింది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక హరిహర వీరమల్లు రెండు పార్టులుగా రానుంది. ఈ సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్నాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ బట్టి వచ్చే సంవత్సరం హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :