Monday, 08 December 2025 04:20:24 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Vishal : విశాల్‌తో సినిమాలు తీయిద్దని నిర్మాతల నిర్ణయం.. చేస్తాను ఆపేందుకు ట్రై చేయండి అంటూ వార్నింగ్..

Date : 27 July 2024 10:54 AM Views : 237

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Vishal : తమిళ్ హీరో విశాల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు. అయితే మొదట్నుంచి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో నిలుస్తాడు విశాల్. ఇటీవల తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని, సినిమాలని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుతున్నారని విమర్శలు చేసారు. అయితే ఈ వివాదం పెద్దది అవ్వడంతో, అలాగే విశాల్ నిర్మాత సంఘంలో ఉన్నప్పుడు నిధులు అక్రమంగా వినియోగించారని ఆరోపిస్తూ విశాల్ తో నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయొద్దంటూ తమిళ నిర్మాతల సంఘం భావించింది. నిర్మాత కథిరేసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో విశాల్ తన సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ నిర్మాత కథిరేసన్ ని, తమిళ నిర్మాత మండలిని డైరెక్ట్ గానే ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసాడు. విశాల్ తన ట్వీట్ లో.. మిస్టర్ కతిరేసన్ మీతో, టీమ్, అందరు వ్యక్తులు కలిసి తీసుకున్న నిర్ణయం అని మీకు తెలీదా. విద్య, వైద్య, బీమా, సీనియర్ నిర్మాతల కుటుంబ సంక్షేమం కోసం నిధులు ఉపయోగించబడ్డాయని మీకు తెలియదా. మీ ఉద్యోగాలను సరిగ్గా చేయండి, పరిశ్రమ కోసం చేయడానికి చాలా ఉంది. డబల్ ట్యాక్సేషన్, థియేటర్ మెయింటెనెన్స్ చార్జీలు.. ఇలా చాలా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. అసలు సినిమాలు తీయని నిర్మాతలు మీరు. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి అని ట్వీట్ చేసాడు. దీంతో విశాల్ ట్వీట్ వైరల్ గా మారగా తమిళ పరిశ్రమలో విశాల్ వివాదం చర్చగా మారింది. రెగ్యులర్ గా ఇలా ఓపెన్ గానే అన్ని మాట్లాడేస్తూ వివాదాల్లో నిలుస్తున్న విశాల్, విశాల్ వ్యతిరేక వ్యక్తులు వీటికి ముగింపు చెప్తారా లేదా చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :