Tuesday, 18 November 2025 04:19:02 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

Prabhas : ప్ర‌భాస్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

Date : 19 August 2024 11:27 AM Views : 128

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas – CM Revanth Reddy : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌బాస్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ‘బాహుబ‌లి’, ‘క‌ల్కి’ సినిమాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంత‌ర్జాతీయ న‌టులు సైతం ప్ర‌భాస్ న‌ట‌న పై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్ర‌భాస్‌ను పొగిడారు. ప్ర‌భాస్ లేకుంటే బాహుబ‌లి మూవీనే లేద‌న్నారు. హైద‌రాబాద్‌లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప‌లు రంగాల అభివృద్ధిలో క్ష‌త్రియుల పాత్ర ఎంతగానో ఉంద‌న్నారు. సినీ రంగం విష‌యానికి వ‌స్తే.. సినీ రంగంలో ఉన్న‌త స్థాయికి ఎదిగిన వ్య‌క్తుల్లో కృష్ణం రాజు ఒక‌రన్నారు. ఆయ‌న పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్ప‌లేమ‌న్నారు. ఇక హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన బాహుబ‌లి మూవీని ప్ర‌భాస్ లేకుండా ఊహించ‌లేమ‌ని చెప్పారు. అదే విధంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ గురించి కూడా సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ రాణించిన రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌కు మంచి మిత్రుడని ముఖ్య‌మంత్రి తెలిపారు. రామ్‌గోపాల్ వ‌ర్మ‌, ప్ర‌భాస్ గురించి ముఖ్య‌మంత్రి మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ‘సలార్’, ‘కల్కి భారీ విజ‌యాలు సాధించ‌డంతో ప్ర‌భాస్ మంచి జోష్‌లో ఉన్నాడు. వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలానే రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ సినిమాలు ప్ర‌భాస్ చేతిలో ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :