Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas – Sandeep Reddy Vanga : ప్రభాస్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కితో హిట్ కొట్టి వచ్చే సమ్మర్ లో రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ లైనప్ కూడా భారీగానే ఉంది. ప్రభాస్ లైనప్ లో అందరూ ఎదురుచూసేది సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సినిమా కోసం. తీసిన మూడు సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ – సందీప్ వంగ కాంబోలో స్పిరిట్ సినిమా అనౌన్స్ చేయగానే అందరూ షాక్ అయ్యారు. ప్రభాస్ ని ఇంకెంత మాస్ గా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ అని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఇటీవల సందీప్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. యానిమల్ కంటే ముందు ప్రభాస్ నన్ను పిలిచి ఒక హాలీవుడ్ రీమేక్ సినిమా చేద్దామన్నారు. కానీ అది నాకు వర్కౌట్ అవ్వదు అనిపించింది. దానికి నో చెప్పి కావాలంటే నాకు కొంచెం టైం ఇస్తే మీకు సెట్ అయ్యే కథ తీసుకొస్తా అని చెప్పాను. కరోనా సమయంలో యానిమల్ రాసుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వస్తే దాన్ని రాసుకొని ప్రభాస్ ని కలిసి వినిపించాను. వెంటనే ఆ సినిమా చేద్దాం అన్నారు. ఆ సినిమా స్పిరిట్ అని తెలిపాడు. ఇక స్పిరిట్ సినిమా వచ్చే సంవత్సరం మొదలవుతుందని సమాచారం.
Admin
Studio18 News