Wednesday, 17 December 2025 01:52:24 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Pawan Kalyan – OG : పవన్ కోసం విజయవాడలో ముంబై సెట్..? OG సినిమా కోసం..

Date : 27 August 2024 04:05 PM Views : 165

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan – OG : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగా బిజీగా ఉన్నారు. పవన్ రాజకీయాల బిజీ వల్ల తన సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉండగా ఎలాగైనా ఆ సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తానని పవన్ తెలిపాడు. అన్నిటికంటే ముందు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమా షూట్ కి డేట్స్ ఇస్తారని తెలుస్తుంది. OG సినిమా ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయింది. పవన్ ఒక రెండు వారాల డేట్స్ ఇస్తే మొత్తం షూట్ అయిపోతుందని సమాచారం. OG సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే గ్యాంగ్ స్టర్ కథ అని తెలిసిందే. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. OG సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది. అయితే ఇప్పుడు పవన్ ముంబైకి వచ్చి షూట్ చేసేంత ఖాళీ లేకపోవడంతో పవన్ కోసం ముంబైని విజయవాడకు తీసుకొస్తున్నారట. విజయవాడలో ముంబై సెట్స్ వేసి OG సినిమా షూటింగ్ చేస్తారట. ఇండోర్ సెట్స్ విజయవాడలో వేసి, అవుట్ డోర్ మాత్రం ముంబైలోనే షూట్ చేస్తారని తెలుస్తుంది. సెప్టెంబర్ లో OG సినిమాకు పవన్ డేట్స్ ఇస్తారని, వారానికి రెండు రోజులు డేట్స్ ఇవ్వనున్నారని, దీనికి తగ్గట్టు సుజీత్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. ఇదే నిజమైతే పవన్ OG సినిమా త్వరలోనే వస్తుంది. ఫ్యాన్స్ అయితే పవన్ OG సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :