Saturday, 07 March 2026 08:53:56 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

సినిమా ఫ్లాప్ అయితే నటీనటుల రెమ్యునరేషన్‌లో సగం నిర్మాతకు తిరిగివ్వాలి.. టాలీవుడ్‌లో చర్చ

Date : 06 September 2024 04:41 PM Views : 267

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : telugu film actors remuneration: ప్లాప్ సినిమాల నష్టాలను భరించేలా టాలీవుడ్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతోందట.. లాభాలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తున్న హీరోలు, హీరోయిన్లు.. నష్టాలు వచ్చినప్పుడు నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్‌ను బలి చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఐతే ఇకపై ఇలాంటి విమర్శలు వినిపించకూడదని టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారట. త్వరలో పరిశ్రమలో చర్చించి ప్రతి స్టార్ ఆ నిర్ణయాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ టాలీవుడ్‌లో చర్చకు కారణమైన ఆ నిర్ణయమేంటో ఇప్పుడు చూద్దాం. సినిమా అంటే సక్సెస్, ఫ్లాప్ రెండూ ఉంటాయి. నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లు విజయం, పరాజయం అత్యంత సహజం. ఐతే సినిమాలు విజయం సాధించినప్పుడు అందరికీ సంబరమే. నటీనటులతోపాటు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అంతా ఖుషీ అవుతుంటారు. కానీ, అదే సినిమా ఫ్లాప్ అయితే నష్టం అంతా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లే భరించాల్సివస్తోంది. ఈ కారణంతోనే చాలా మంది ఆర్థికంగా కుదేలయ్యారు. ఐతే ఇప్పుడు ఇలా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని టాలీవుడ్‌ పెద్దల్లో విస్తృత చర్చ జరుగుతోందని సమాచారం. సినిమా విజయం అయితే ఎంజాయ్ చేస్తున్న నటీనటులు.. ఇకపై ఫ్లాప్ అయితే తమ రెమ్యునరేషన్‌లో సగం తిరిగి నిర్మాతలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. ఇదే సమయంలో డిస్టిబ్యూటర్లను ఆదుకోవడానికి నిర్మాతలు బాధ్యత తీసుకోవాలని కండీషన్ కూడా పెడుతున్నారట. ఇలా చేస్తే నష్టం వచ్చినా అందరూ భరించడంతోపాటు నిర్మాత, డిస్టిబ్యూటర్‌లు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుకోవడం అవుతుందని అంటున్నారు. ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే మిస్టర్ బచ్చన్ సినిమాకు రవితేజ 4 కోట్లు, హరీశ్ శంకర్ రెండు కోట్లు నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారని టాక్. దీంతో ఈ ప్రతిపాదనపై టాలీవుడ్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. త్వరలో నిర్మాతల మండలిలో చర్చించి అధికారికంగా తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :