Monday, 08 December 2025 03:11:54 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Rashmika – Puhspa 2 : పుష్ప 2 సాంగ్ పై రష్మిక కామెంట్స్.. ఆ డ్యాన్స్ వేయడానికి చాలా గంటలు పట్టింది..

Date : 04 August 2024 10:16 AM Views : 222

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rashmika Mandanna – Puhspa 2 : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి రెండు పాటలు, గ్లింప్స్ రిలీజవ్వగా వీటితో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే సినిమా ఆగస్టు నుంచి డిసెంబర్ కి వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంకా పుష్ప 2 షూటింగ్ జరుగుతూనే ఉంది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6 విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 1లో రష్మిక తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. సాంగ్స్ లో కూడా ఆడియన్స్ లతో మెప్పించింది. తాజాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కి రష్మిక గెస్ట్ గా రావడంతో ఈ ఎపిసోడ్ వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో రష్మిక పుష్ప 2 గురించి మాట్లాడింది. రష్మిక మందన్నా పుష్ప 2 గురించి మాట్లాడుతూ.. ఒక సాంగ్ లో బాగా కష్టపడ్డాను. కెమెరా లెన్స్ దగ్గర హ్యాండ్ మూమెంట్స్ తో వేసే స్టెప్స్ కోసం చాలా కష్టపడ్డాను. ఆ స్టెప్స్ వేయడానికి చాలా గంటలు పట్టింది. చాలా టేక్స్ తీసుకున్నాను. ఆ పాట మొత్తం కూడా బాగుంటుంది. సుకుమార్ గారు చాలా పర్ఫెక్ట్ గా ప్రతి సీన్ చూసుకుంటున్నారు. పుష్ప 1 కంటే పుష్ప 2 చాలా పెద్ద సినిమా అవుతుంది అని తెలిపింది. దీంతో రష్మిక వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఆ సాంగ్ ఏంటి? రష్మికనే డ్యాన్స్ ఉందని చెప్తుందంటే బన్నీ డ్యాన్స్ కూడా ఆ పాటలో అదిరిపోయి ఉంటుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :