Wednesday, 17 December 2025 04:05:40 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

KCR – Double Ismart : డబల్ ఇస్మార్ట్ – కేసీఆర్ వివాదం.. అందుకే కేసీఆర్ డైలాగ్ తీసుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన మణిశర్మ..

Date : 27 July 2024 10:14 AM Views : 242

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : KCR – Double Ismart : పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు వచ్చి మెప్పించాయి. ఆగస్టు 15న డబల్ ఇస్మార్ట్ సినిమా రాబోతుంది. అయితే ఇటీవల ‘మార్ ముంత చోడ్ చింత..’ అనే పాట రిలీజయి బాగా వైరల్ అయింది. ఈ మార్ ముంత చోడ్ చింత సాంగ్ లో కేసీఆర్ పాపులర్ డైలాగ్ ‘ఏం చేద్దామంటావ్’ అని కేసీఆర్ వాయిస్ తోనే వాడారు. గతంలో ఓ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ‘ఏం చేద్దామంటావ్’ అని అన్న డైలాగ్ బాగా వైరల్ అయింది. ఈ డైలాగ్ ని అలాగే తీసుకొచ్చి తమ పాటలో పెట్టుకున్నారు. అయితే ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ డైలాగ్ పెట్టి అవమానించారని, పాటలో ఆ డైలాగ్ తీసేయాలని విమర్శలు చేసారు. పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చారు. తాజాగా ఈ వివాదం పై సంగీత దర్శకుడు మణిశర్మ స్పందించాడు. మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. అందరూ కేసీఆర్ కు అభిమానులే. ఆయన డైలాగ్ పాటలో పెట్టాలని అందరం అనుకొనే పెట్టాము, అదేమీ ఐటెం సాంగ్ కాదు. కేసీఆర్ స్పీచ్ లు, డైలాగ్స్ చాలా వైరల్ అయ్యాయి. ఆయన్ని గుర్తుంచుకోడానికి పాటలో ఆయన డైలాగ్ పెట్టాము. ఈ పాట రాసిన కాసర్ల శ్యామ్, రాహుల్ సిప్లిగంజ్ కి కూడా కేసీఆర్ డైలాగ్ నచ్చింది. వాళ్ళు కూడా కేసీఆర్ కి, ఆయన స్పీచ్ కి అభిమానులే. పాటని ఎంజాయ్ చేయండి అంతే కానీ నెగిటివ్ గా తీసుకోకండి అని అన్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఏమంటారో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :