Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Jr NTR : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురిసిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విజయవాడ, ఖమ్మం లాంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు అన్ని కోల్పోయారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఏపీ, తెలంగాణకు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటిస్తూ ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని తెలిపారు.
Admin
Studio18 News