Wednesday, 17 December 2025 03:06:19 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Balakrishna – Pawan Kalyan : సీఎం చంద్రబాబు సరే.. ఆ రోజు బాలయ్య బాబు కోసం డిప్యూటీ సీఎం వస్తారా?

Date : 05 August 2024 02:47 PM Views : 196

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Balakrishna – Pawan Kalyan : సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ 14 ఏళ్ళ వయసులోనే ఎన్టీఆర్ తాతమ్మ కల సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అప్పట్నుంచి 50 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. తాతమ్మ కల 29 ఆగస్టు 1974లో రిలీజయింది. నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలుపెట్టి 50 ఏళ్ళు అవుతుండటంతో ఓ పక్క అభిమానులు, మరో పక్క సినీ పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ తరపున పలు యూనియన్స్ కలిసి హైదరాబాద్ లో ఘనంగా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలని 1 సెప్టెంబరు 2024న చేయబోతున్నారు. దీంతో ఈ వేడుకపై టాలీవుడ్ తో పాటు బాలకృష్ణ అభిమానులకు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు కావడంతో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా వస్తారని సమాచారం. దీంతో ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ నడుస్తుంది. బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలకు పవన్ కళ్యాణ్ వస్తారా అని సందేహం వ్యక్తం అవుతుంది. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్.. ఇలా బాలయ్యతో సమానంగా ఉన్న స్టార్ హీరోలు టాలీవుడ్ నుంచి వస్తారో రారో అనుకున్నా ఏపీ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా పవన్ కళ్యాణ్ వస్తారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు 100 శాతం ఉండటంతో ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా రావొచ్చని తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల ముందు నుంచి బాలయ్య, పవన్ బాగా క్లోజ్ అయ్యారు. కలిసి ప్రచారం చేశారు, బాలయ్య అన్‌స్టాపబుల్ ఈవెంట్ కి పవన్ వచ్చారు. దీంతో మరోసారి పవన్ బాలయ్య కోసం వస్తారా? ఈ ఇద్దర్ని ఒకే స్టేజిపై ఇంకోసారి చూడొచ్చా? బాలయ్య గురించి పవన్ మాట్లాడతారా అని అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు వచ్చినా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చినా బాలయ్య 50 ఏళ్ళ నట ప్రస్థాన వేడుకలు ఫ్యాన్స్ కి స్పెషల్ గా గుర్తుండిపోవడం ఖాయం. ఇక ప్రస్తుతం బాలయ్య NBK109 సినిమా షూటింగ్ తో బిజీగానే ఉంటూ మరో పక్క హిందూపురం ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచి ప్రజాసేవలో ముందుకెళ్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అంతా సెప్టెంబర్ 1 జరిగే బాలయ్య స్వర్ణోత్సవ సంబరాల ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :