Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Nani Son Arjun : న్యాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, సెకండ్ హీరోగా, ఆ తర్వాత హీరోగా చేసి వరుస హిట్స్ కొట్టాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి సక్సెస్ కొట్టిన నాని త్వరలో సరిపోదా శనివారం సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నాని ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మన టాలీవుడ్ సెలెబ్రిటీలలో కూడా చాలా మంది సినీ పరిశ్రమలోకే వస్తారు. కేవలం నటన మాత్రమే కాకుండా వివిధ విభాగాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు నాని కొడుకు కూడా సినీ పరిశ్రమలోకే వస్తాడని తెలుస్తుంది. నాని కొడుకు అర్జున్ ఇటీవల కొన్ని రోజుల క్రితం అద్భుతంగా పియానో వాయించిన వీడియోల్ని నాని షేర్ చేసాడు. తాజాగా నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు అర్జున్ గురించి మాట్లాడుతూ.. నా కొడుకు సంగీతం, స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. ఇప్పటికే అర్జున్ ఆల్రెడీ పియానో నేర్చుకున్నాడు. నా పాటల్ని ప్లే చేసి నాకు వినిపిస్తాడు. ఈ వయసులో ఎంతో ఆసక్తి ఉంటే తప్ప పియానో అంత తొందరగా నేర్చుకోలేరని వాడి టీచర్లు చెప్తుంటారు. మా అబ్బాయికి సంగీతంపై మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యూచర్ లో నా సినిమాకి సంగీతం ఇస్తాడేమో చూడాలి అని అన్నారు. నాని తనయుడు అర్జున్ పియానో వాయించిన వీడియోలు గతంలో వైరల్ అవ్వడం, ఇప్పుడు నాని కూడా అర్జున్ సంగీతం గురించి చెప్పడం, ఫ్యూచర్ లో తన సినిమాలకి వాయిస్తాడేమో అని చెప్పడంతో అర్జున్ భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో అని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో నాని ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతున్నాడని తెలిసిందే.
Admin
Studio18 News