Sunday, 08 March 2026 10:31:07 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి ఇంట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటో.. గ‌మ‌నించారా..?

Date : 31 August 2024 04:54 PM Views : 261

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టాలీవుడ్‌లో ప్ర‌ముఖ యాంక‌ర్ల‌లో స్రవంతి ఒక‌రు. త‌న‌దైన మాట‌ల‌తో, ఎప్పటికప్పుడు తన అందాలతో టాలెంట్ చూపిస్తూండే ఆమెకు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంక‌ర్‌గా, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా జ‌నాల్లో త‌నదైన ముద్ర వేసుకుంది. అనుకోకుండా నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తరువాత కొన్ని సినిమాలలో నటించి, తరువాత టీవిలో హోస్ట్ గా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. ఇక శ్రావ‌ణ మాసం ఆఖ‌రి శుక్ర‌వారం కావ‌డంతో నిన్న వ‌ర‌ల‌క్ష్మి వ‌త్రం చేసుకుంది. ప‌ద్ద‌తిగా సంప్ర‌దాయంగా చీర‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లో కొన్నింటిలో గోడ‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫోటో ఉంది. ఈ ఫోటోలు ఆమె ఇంట్లోవి కావ‌డం, ఆమె ప‌వ‌న్ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవ‌డం వైర‌ల్‌గా మారింది. దీనిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సాధారణ వ్యక్తులే కాదు సెలబ్రిటీలు సైతం పవన్ కల్యాణ్ అభిమానులు అని ఫ్యాన్స్ వెల్లడిస్తుండటం గమనార్హం. వాస్త‌వానికి తాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వీరాభిమాని అని సంగ‌తి ఓ సంద‌ర్భంలో స్రవంతి చొక్కారపు స్వ‌యంగా వెల్ల‌డించింది. అంతేకాదండోయ్ త‌న కొడుకుకి ప‌వ‌న్ కుమారుడి పేరు అయిన అకీరా నంద‌న్ అని కూడా పెట్టుకుంది. “నేను పవన్ కళ్యాణ్ కి మొదటి నుండీ చాలా పెద్ద అభిమానిని. అందుకే మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు అయిన అకీరా నందన్ అని పేరు పెట్టాను” అని చెప్పింది స్రవంతి. అంతేనా.. తాను నడుపుతున్న బోటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేట్టుగా అకీరా లేబిల్ అనే పేరు పెట్టింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :