Wednesday, 17 December 2025 04:14:44 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Hari Hara Veera Mallu : షూటింగ్ మొదలుపెట్టిన ‘హరిహర వీరమల్లు’.. పవన్ ఎప్పుడు జాయిన్ అవుతాడంటే..?

Date : 16 August 2024 01:42 PM Views : 171

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Hari Hara Veera Mallu shooting update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. చాన్నాళ్ల క్రిత‌మే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినా కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే.. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఆగ‌స్టు 14 (బుధ‌వారం) నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది. ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలిపింది. 400 నుంచి 500 మంది ఫైట‌ర్లు, జూనియ‌ర్ ఆర్టిస్టులు ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటార‌ని మూవీ యూనిట్ తెలియ‌జేసింది. దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను అందుకున్న‌ తరువాత, ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :