Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Chiranjeevi – Revanth Reddy : నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఇటీవల తెలంగాణలో వరదలు వచ్చి ఖమ్మం, పరిసర ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం చిరంజీవి, రామ్ చరణ్ రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్స్ కి ప్రకటించారు. తాజాగా చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి తన 50 లక్షలు, చరణ్ తరపున 50 లక్షలు చెక్కు రూపంలో అందించారు. సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవికి ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. అనంతరం చిరంజీవి, రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Admin
Studio18 News