Sunday, 08 February 2026 01:36:40 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Avram Manchu: కృష్ణాష్టమి రోజున ‘కన్నప్ప’ నుంచి అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ విడుదల

Date : 23 August 2024 06:08 PM Views : 275

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 26) సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం స్పెషల్ కానుంది. అవ్రామ్ పాత్ర, సినిమాలో లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆగస్టు 26 వరకు ఆగాలి. విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న కన్నప్ప అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :