Sunday, 08 March 2026 03:27:12 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Jayam Ravi: భార్య‌కు విడాకులిచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో

Date : 09 September 2024 03:49 PM Views : 302

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తాజాగా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సంచలన ప్రకటన చేసి, అభిమానుల‌కు షాకిచ్చారు. తన భార్య‌ ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ దంప‌తులు విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ జ‌యం ర‌వి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. అలాగే తాము ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఇక ఈ జంట 2009లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. దాదాపు ప‌దిహేను ఏళ్ల పాటు ర‌వి, ఆర్తి త‌మ‌ వైవాహిక జీవితాన్ని గడిపారు. ఈ దంప‌త‌లకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 'ఎక్స్‌'లో జ‌యం ర‌వి పోస్ట్ చేసిన లేఖ‌లో ఏముందంటే.. "జీవితం చాలా అధ్యాయాలతో నిండిన ఒక‌ ప్రయాణం లాంటిది. ఇందులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీలో చాలామంది నన్ను ఆదరించారు. అలాగే నాకు స‌పోర్ట్ కూడా చేశారు. అందుకే నేనెప్పుడు నా ఫ్యాన్స్‌, మీడియాతో నిజాయతీగా ఉంటాను. ఈ నేప‌థ్యంలోనే ఇవాళ‌ మీతో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. భారమైన హృదయంతో ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల‌ తర్వాత నేను, నా భార్య‌ ఆర్తి డైవ‌ర్స్‌ తీసుకోవాలనే కఠినమైన నిర్ణయానికి వ‌చ్చాం. మేము ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. మా ఇద్దరి భ‌విష్య‌త్ కోస‌మే కోసమే ఇలా చేయాల్సి వ‌స్తోంది. ఈ సమయంలో మాతో పాటు మా కుటుంబసభ్యుల వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ విష‌యంపై పుకార్లు, ఆరోపణలు మానేయాలని మ‌న‌వి చేస్తున్నాను. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. చిత్రాల‌ విషయంలో నా ప్రాధాన్యం ఎప్పుడూ ఇలాగే కొన‌సాగుతుంది. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం నేను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. నాకు ఇక‌పై కూడా మీరు ఇలానే మద్దతుగా ఉంటార‌ని ఆశిస్తున్నాను" అంటూ జయం రవి త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :