Wednesday, 17 December 2025 02:39:01 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Raj Tarun – lavanya : నేడు మీడియా ముందుకు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రి.. లావణ్య వివాదం గురించి మాట్లాడతారా?

Date : 31 July 2024 12:49 PM Views : 209

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Raj Tarun – lavanya : గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ తో పదేళ్లకు పైగా కలిసి జీవించానని, రాజ్ నన్ను పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆరోపణలు చేసి కేసు పెట్టింది. ఇప్పటికే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా పంపారు. అయితే దీనిపై రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి స్పందించి.. ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది, ఆమెవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టి అనంతరం కనిపించకుండా మాయమయింది. మాల్వి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా రాజా తరుణ్ ఫోన్ నంబర్ కూడా మార్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. రాజ్ తరుణ్ బయటికి వస్తే బోలెడన్ని ప్రశ్నలు అడగడానికి మీడియా రెడీగా ఉంది. ఇందుకోసమే రాజ్ తరుణ్ బయటకి రావట్లేదని సమాచారం. అయితే ఇటీవల జులై 26న రాజ్ తరుణ్ హీరోగా చేసిన పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా ప్రమోషన్స్ కి కూడా రాజ్ తరుణ్ రాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబడరా సామీ సినిమా ఆగస్టు 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా ఇప్పటివరకు రాజ్ తరుణ్ రాలేదు. కానీ నేడు మధ్యాహ్నం తిరగబడరా సామి సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ కి రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రి కూడా వస్తారని సమాచారం వచ్చింది. నిర్మాత కూడా హీరో హీరోయిన్స్ వస్తారు, మీడియాతో మాట్లాడతారు అని చెప్పారు. దీంతో రాజ్ తరుణ్ వస్తాడా? రాజ్ తరుణ్ వచ్చినా లావణ్య వివాదం గురించి మాట్లాడతాడా? లేక కేవలం సినిమా గురించి మాట్లాడతాడా అని అంతా భావిస్తున్నారు. అయితే మీడియాతో ప్రెస్ మీట్ కూడా ఉందని ఆల్రెడీ సినీ మీడియాకు సమాచారం వచ్చింది. మరి మీడియా అడిగే ప్రశ్నలకు లావణ్య విషయంలో రాజ్ తరుణ్ మాట్లాడతాడా? లేదా కేవలం సినిమా గురించే అడగమని తప్పించుకుంటాడా చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :