Sunday, 08 February 2026 10:11:52 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Balakrishna : బాలకృష్ణ 50 ఏళ్ళ నట ప్రస్థానం వేడుకలు షురూ..

Date : 08 August 2024 10:23 AM Views : 282

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్ళు పూర్తిచేసుకోవడంతో ఇటు తెలుసు పరిశ్రమ, అటు అభిమానులు స్పెషల్ సెలబ్రేషన్స్ చేయనున్నారు. తెలుగు పరిశ్రమలో అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వారు కలిసి సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, వైవిఎస్ చౌదరి, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేయడం గొప్ప విషయం. మా నాన్నలాగే ఎలాంటి పాత్రను అయినా చేయగలను అని నిరూపించుకున్నాడు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా బాలకృష్ణ నాన్న గారి వారసత్వం అందుకున్నారు అని అన్నారు. సీనియర్ డైరెక్టర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి అయినా ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇన్నేళ్లు నటుడిగా కెరీర్ చూసిన వాళ్ళు అమితాబ్ తర్వాత బాలయ్యే. బాలకృష్ణ చిన్నప్పట్నుంచి కూడా ఒక సామాన్యుడిలాగే తిరుగుతారు. బాలకృష్ణ 50 వసంతాల ఈవెంట్ సినీ పరిశ్రమ నిర్వహించడం మంచి విషయం అని అన్నారు. సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. బాలకృష్ణతో అందరికంటే ఎక్కువగా 13 సినిమాలు చేశాను. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య అనే వినిపిస్తుంది. బాలకృష్ణ అంతలా యూత్ నాడి పట్టుకున్నారు అని తెలిపారు. సీనియర్ నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ.. మా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఆయన సినిమాల రికార్డుల ఫంక్షన్ కంటే గొప్పగా జరగాలి. సినీ పరిశ్రమలో అందరికి బాలయ్య గారి మీద ప్రేమ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటీనటులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప ఈవెంట్‌గా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ జరుగుతుంది అని తెలిపారు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. 1974లో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అప్పుడే 50 ఏళ్లు అయిపోయిందా అనిపిస్తుంది. బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు ఎన్టీఆర్ రూపంలో గురువు కూడా ఇంట్లోనే ఉండటం అది ఆయన అదృష్టం. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని అన్నారు. నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సేవలందరిస్తూ హీరో నందమూరి బాలకృష్ణ పలు రికార్డులు సాధించారు. సేవారంగంలో కూడా బాలకృష్ణగారు ఎన్నో దానాలు చేశారు. మదనపల్లెలో ఒక టీచర్ కుమార్తెకు తన సొంతడబ్బుతో చికిత్స చేయించారు. రాయలసీమలో వరదలు వచ్చినప్పుడు స్పందన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన బాలయ్య 50 ఏళ్ల వేడుకకు అందరూ రావాలి. ఈ వేడుకకు బాలయ్య ఒప్పుకోలేదు కానీ ఇది ఒక స్ఫూర్తిదాయ కార్య్రక్రమంగా ఉంటుందని చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారని అన్నారు. రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. నా అభిమాన హీరో రామారావుగారికి 1981లో ఛండశాసనుడు అనే సినిమాకు రాస్తున్నప్పుడు ఒక అందమైన కుర్రాడ్ని చూసాను. అతనే బాలకృష్ణ. బాలయ్యకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు హిట్ ఇచ్చింది. టాలీవుడ్ లోని అన్ని అసోసియేషన్స్ కలిసి బాలయ్య 50 ఏళ్ల వేడుకని చేయడం గొప్ప విషయం అని తెలిపారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 50 నిమిషాల పాటు వాకింగ్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లు సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఇలాంటి వేడుక చేయడం అభినందనీయమైన విషయం. చేసిన పాత్ర చేయకుండా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల్లో 109 సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడూ ఇలాగే ఎనర్జిటిక్ గా ఉండి ఇంకా సినిమాలు చేయాలి అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :