Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mufasa: The Lion King Trailer : 1994లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘లయన్ కింగ్’ అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ రాబోతుంది. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ తో యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో ఈ సినిమా బారీ జెంకిన్స్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 20న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మన దేశంలో కూడా హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. అయితే హిందీలో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమాకు ఈసారి షారుఖ్ ఖాన్ తో పాటు అతని కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రమ్ ఖాన్ డబ్బింగ్ ఇచ్చారు. సింబకు ఆర్యన్, అబ్రామ్ యువ ముఫాసాకు, ముఫాసాకు షారుఖ్ వాయిస్ లు ఇచ్చారు. ఈ ముగ్గురు వాయిస్ లు ఇవ్వడంతో ఇండియాలో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
Admin
Studio18 News