Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mokshagnya Full Name : గత కొన్నేళ్లుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని వస్తున్న వార్తలకు నేటితో శుభం కార్డు పడింది. ఇవాళ మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా మోక్షజ్ఞ మొదటి సినిమాని ప్రకటించారు. SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమాని ప్రకటించారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. పోస్టర్ లో చూస్తుంటే మోక్షజ్ఞ చాలా ఛేంజ్ అయి సినిమా కోసం చాలా బాగా మారాడు. దీంతో బాలయ్య తనయుడు మోక్షు లుక్ అదిరిపోయిందిగా అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞకి బర్త్ డే విషెస్ చెప్తూ ఈ పోస్టర్ షేర్ చేసి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ పూర్తి పేరు రాసుకొచ్చాడు. ప్రశాంత్ వర్మ.. ‘నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ’కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూర్తిపేరు రాసుకొచ్చాడు. దీంతో మోక్షజ్ఞ పేరులో తాతయ్య తారక రామ పేరు కూడా ఉండటంతో ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాతయ్య, నాన్న పేర్లను నిలబెట్టేలా మోక్షజ్ఞ హీరోగా ఎదుగుతాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇక మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం బాలయ్య రెండో కూతురు తేజస్విని నిర్మాతగా మారడం విశేషం.
Admin
Studio18 News