Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయ్ మూవీ యూనిట్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మాత బన్నీవాసు తెలియజేశారు. ఆయ్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి నేటి (సెప్టెంబర్ 2) నుంచి వీకెండ్ వరకు వచ్చే కలెక్షన్లలో నిర్మాత షేర్‌లోని 25 శాతాన్ని జనసేన పార్టీ తరుపున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. చిత్ర బృందం మంచి మనసును ఈ సందర్భంగా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన మూవీ ‘ఆయ్’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్ గా అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Admin
Studio18 News