Monday, 19 January 2026 08:00:32 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Phir Aayi Hasseen Dillruba : ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ రివ్యూ.. తాప్సీ సీక్వెల్ సినిమా కూడా అదరగొట్టేసిందిగా..

Date : 12 August 2024 11:26 AM Views : 178

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Phir Aayi Hasseen Dillruba Movie Review : విక్రాంత్ మస్సె, సన్నీ కౌశల్, తాప్సీ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’. 2021లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘హసీన్‌ దిల్‌రుబా’కు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ నిర్మాణంలో జయప్రద్ దేశాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కథ విషయానికొస్తే.. హసీన్‌ దిల్‌రుబాలో రుషి(విక్రాంత్) తన భార్య రాణి(తాప్సీ)ని ఇబ్బందిపెట్టే తన చుట్టాల అబ్బాయి నీల్(హర్షవర్ధన్ రానే)ని చంపేసి, తన చెయ్యిని నరుక్కొని తాను చనిపోయినట్టు సృష్టిస్తాడు. అందరూ రుషి చనిపోయాడనుకున్నా ఓ పోలీస్ రాణిపై అనుమానం వ్యక్తం చేస్తాడు. సినిమా చివర్లో రుషి బతికే ఉన్నాడు అని పోలీస్ కి అర్థమయ్యేలా హింట్ ఇచ్చి సినిమాని ఎండ్ చేసారు. ఇప్పుడు ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబాలో రుషి, రాణి వేరు వేరు పేర్లతో దూరంగానే ఉంటూ అప్పుడప్పుడు కలుస్తూ ఆగ్రాలో బతుకుతూ ఉంటారు. ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలని డబ్బుల కోసం కష్టపడుతూ ఉంటారు. గతంలో రుషి – రాణి కేసు డీల్ చేసిన పోలీస్ ఆగ్రాకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో అతనికి రాణి కనిపిస్తుంది. చనిపోయిన నీల్ మామయ్య మోంటీ పోలీసాఫీసర్ కావడంతో అతనికి ఈ విషయం తెలిసి ఆగ్రాకి వచ్చి ఆ కేసుని మళ్ళీ ఓపెన్ చేసి రాణికి వార్నింగ్ ఇచ్చి, వీళ్ళు దేశం విడిచి పోవడానికి సహాయం చేసే ట్రావెల్ ఏజెంట్ ని పట్టుకుంటారు. దీంతో రాణి, రుషి భయపడతారు. అప్పటికి రాణిని అభిమన్యు(సన్నీ కౌశల్) ప్రేమిస్తూ ఉంటాడు. రుషిని పూనమ్ ప్రేమిస్తుంది. పోలీసాఫీసర్ మోంటీ నుంచి తప్పించుకోవడానికి రాణి అభిమన్యుని పెళ్లి చేసుకుంటుంది. కానీ రుషి బతికే ఉన్నాడని మోంటీకి తెలియడం, రాణి రుషి గురించి అభిమన్యుకి చెప్పడం, ఓ ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో రాణిని పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో రుషి బయటకి వస్తాడు. రుషి, రాణి, అభిమన్యు పోలీసుల నుంచి మళ్ళీ ఎలా తప్పించుకున్నారు? రుషి, రాణి ఎలా ఒక్కటయ్యారు? అభిమన్యు ఎందుకు వీళ్ళతో కలిసాడు? పోలీసులు వీళ్ళని పట్టుకున్నారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ.. 2021లో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ హసీన్‌ దిల్‌రుబా మంచి హిట్ అయింది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ తో సినిమా అందరికి నచ్చింది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా అంతకు మించి ట్విస్టులతో వచ్చింది. ఆగ్రాలో విడివిడిగా బతుకుతున్న రాణి, రిషి జీవితాలు పోలీస్ ఎంట్రీ ఇచ్చేవరకు బాగానే ఉంటాయి. అక్కడ్నుంచి వరుస ట్విస్టులతో సాగుతుంది. పోలీసులు వీళ్లపై నిఘా వేయడం, వీళ్ళు వాటిని తప్పించుకొని ఎత్తుకు పై ఎత్తు ప్లాన్స్ వేయడంతో అదిరిపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఇదేంటి సింపుల్ గా పోలీసులకు దొరికిపోయారు అని అంతా అనుకునే లోపే అక్కడ వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అప్పటికే సినిమా అయిపోయింది అనుకుంటే క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 3కి లీడ్ ఇవ్వడం గమనార్హం. పార్ట్ 1తో పోలిస్తే రొమాంటిక్ కొంచెం తగ్గినా థ్రిల్లింగ్ అంశాలు మాత్రం చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అని ఆసక్తిగానే సాగుతుంది ఈ సినిమా. వీళ్ళు వేసే ప్లాన్స్ అన్ని ఒక రచయిత పుస్తకాల్లోంచి తీసుకున్నట్టు ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టే సెకండ్ పార్ట్ లో ఆ పుస్తకాల గురించి ఇంకా ఎక్కువగా చూపించారు. నిజమైన ప్రేమ కోసం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండటానికి ఏం చేసారు అని మరోసారి రొమాంటిక్ థ్రిల్లర్ తో చూపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్.. తాప్సీ తన అందంతో పాటు నటనతో కూడా మెప్పించింది. విక్రాంత్ మస్సె, సన్నీ కౌశల్ ఒకరికొకరు పోటీ పడి మరీ నటించారు. పోలీసాఫీసర్ పాత్రల్లో ఆదిత్య శ్రీవాత్సవ్, జిమ్మీ బాగా నటించారు. పూనమ్ పాత్రలో భూమిక దూబే అదరగొట్టింది చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు. సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేసారు. కొత్త కథే అయినా కథనం బాగున్నా కొన్ని చోట్ల మాత్రం సాగదీత కనిపిస్తుంది. డైరెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. నిర్మాణపరంగా టీ సిరీస్ ఫిలింస్ బాగానే ఖర్చుపెడతారని తెలిసిందే. మొత్తంగా ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’ సినిమా పార్ట్ 1 కంటే ఎక్కువ ట్విస్టులతో, తక్కువ రొమాన్స్ తో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాగా బాగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :