Monday, 08 December 2025 03:44:02 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Stree 2: 'స్త్రీ' రికార్డును బద్దలు కొట్టిన 'స్త్రీ-2'

Date : 13 August 2024 05:29 PM Views : 194

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఈ ఇండిపెండెన్స్ డేకు బాలీవుడ్‌లో మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. శ్ర‌ద్ధా క‌పూర్‌, రాజ్‌కుమార్ రావు జంటగా న‌టించిన 'స్త్రీ-2', జాన్ అబ్రహం 'వేదా', అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే'. అయితే, అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం 'స్త్రీ-2' దూసుకెళుతోంది. ఈ రేసులో మిగిలిన రెండు చిత్రాల‌ను పూర్తిగా వెన‌క్కి నెట్టేసింది. ఇప్పుడు ఈ సినిమా తనదైన బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది. ఒరిజినల్ 'స్త్రీ'మూవీ 2018లో విడుదలైంది. ఆ సినిమా మొద‌టి రోజు రూ. 6.82 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. అలాగే మొత్తం ర‌న్ టైమ్‌లో దాదాపు రూ. 130 కోట్లు రాబట్టింది. అయితే, 'స్త్రీ-2' అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 2.21ల‌క్ష‌ల టికెట్లు అమ్ముడుపోగా, రూ. 6.87కోట్లు వ‌చ్చిన‌ట్లు 'సక్‌నిల్క్' తెలిపింది. దీంతో 'స్త్రీ' తొలి రోజు వసూళ్ల రికార్డును 'స్త్రీ-2' కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే బద్దలు కొట్టిన‌ట్లైంది. ఇక చిత్రం విడుదలకు మరో 2 రోజులు ఉన్నందున‌ ఇది సులభంగా 10 కోట్ల రూపాయలను దాటుతుందని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కాగా, మహారాష్ట్ర, ఢిల్లీల‌లో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ మూవీ వరుసగా రూ. 1.87 కోట్లు, రూ. 1.83 కోట్లు వసూలు చేయ‌డం విశేషం. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కామెడీ, హారర్ జానర్ లో తెరకెక్కింది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. దాంతో మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :