Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Megastar Chiranjeevi : కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 300 మందికి పైగా మరణించగా చాలామంది నిరాశ్రయులు అయ్యారు. వయనాడ్ బాధితులకు దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది సౌత్ సినీ పరిశ్రమల సెలబ్రిటీలు కూడా వయనాడ్ కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలు అందచేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళం ఇచ్చారు. చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి తన సోషల్ మీడియాలో.. గత కొన్ని రోజులుగా కేరళలో జరిగిన విపత్తుని చూసి చలించిపోయాను. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నన్ను చాలా కదిలించింది. నేను, చరణ్ కలిసి కోటి రూపాయలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు బాధితుల కోసం అందిస్తున్నాము. ఆ బాధ నుంచి అందరూ కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నాను అని పోస్ట్ చేశారు. దీంతో చిరంజీవిని మరోసారి అభిమానులు, నెటిజన్లు అందరూ అభినందిస్తున్నారు. గతంలో కూడా అచిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇలాంటి ఎన్నో దానాలు చేసి ప్రజల మెప్పు పొందిన సంగతి తెలిసిందే.
Admin
Studio18 News