Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Actor Surya : తమిళ స్టార్ హీరో సూర్యను పరిచయం చేయాల్సిన పని లేదు. గజినీ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చెదరని ముద్ర వేశాడు. నేడు (జూలై 23) ఆయన పుట్టిన రోజు. 49వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు, అభిమానులు సూర్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యకు ఆయన తమ్ముడు, నటుడు కార్తీ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ‘సున్నా నుంచి మొదలు పెట్టినా పర్వాలేదు.. ఏదైనా నేర్చుకుని, కష్టపడి, అంకితభావంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని చూపించిన నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ సమాజంలో ప్రేమను పంచే మా అభిమానులకు మేము మా ప్రేమను అందిస్తున్నాము.’ అంటూ ఎక్స్‌లో అన్నయ్యతో దిగిన ఫోటోను పోస్ట్ చేసి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Admin
Studio18 News