Wednesday, 17 December 2025 02:49:51 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Sirivennela: ఆ ఒక్క మాటతో శాస్త్రిగారు నన్ను కొడుకులా చూసుకున్నారు: ఆర్పీ పట్నాయక్

Date : 31 July 2024 11:53 AM Views : 186

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సిరివెన్నెల రాసిన ప్రతి పాట ఒక అనుభూతి పరిమళం .. జ్ఞాపకాల జలపాతం. అలాంటి సిరివెన్నెలను ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి సంగీత దర్శకుడు ఇష్టపడుతూ ఉంటారు. ఈటీవీ వారు నిర్వహిస్తున్న 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమంలో, సిరివెన్నెలతో తనకి గల అనుబంధాన్ని గురించి ఆర్పీ పట్నాయక్ పంచుకున్నారు. " శాస్త్రిగారు అంటే మొదటి నుంచి కూడా నాకు గౌరవ భావం ఉండేది. ఆయనతో నేను కలిసి పనిచేసిన మొదటి సినిమా 'మనసంతా నువ్వే'. అయితే అంతకంటే ముందుగా మేమిద్దరం ఒక సినిమాకి కలిసి పనిచేశాము. కానీ ఆ ప్రాజెక్టులో నుంచి నేను బయటికి రావలసి వచ్చింది. అందువలన 'మనసంతా నువ్వే' సినిమానే మేము కలిసి పనిచేసిన మొదటి సినిమాగా చెప్పుకోవాలి. "కొంతకాలం తరువాత .. 'మొదటి సినిమా నుంచి ఎందుకు బయటికి వెళ్లిపోవలసి వచ్చింది?' అని శాస్త్రిగారు అడిగారు. 'ఎథిక్స్ ఒప్పుకోకపోవడం వలన బయటికి వచ్చేశాను సార్' అన్నాను నేను'. 'ఏంటి .. ఫస్టు సినిమా విషయంలో ఎథిక్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చావా నువ్వు?' అన్నారు. ' ఎందుకో అది కరెక్టు కాదని అనిపించి వచ్చేశాను సార్' అన్నాను. అంతే ఆ ఒక్క మాట తరువాత నన్ను శాస్త్రిగారు వదిలిపెట్టలేదు. ఒక కొడుకులా నన్ను చూసుకున్నారు. ఇతనికి నైతిక విలువలు ఉన్నాయి .. వాటి కోసం మొదటి సినిమాను కూడా కేర్ చేయలేదు అనే ఒక ఆలోచన కారణంగా ఆయనకి నేను నచ్చాను. ఆయనను కలవాలంటే ఎవరైనా అపాయింట్ మెంట్ తీసుకోవాలేమోగానీ, ఏ వేళలో అయినా అపాయింట్ మెంట్ లేకుండా వెళ్లే ఫ్రీడమ్ నాకు ఉండేది .. ఆయనతో అనుబంధం మరిచిపోలేనిది" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :