Monday, 19 January 2026 08:09:36 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Murari Record : ఆన్లైన్ టికెట్ బుకింగ్స్‌లో కూడా ‘మురారి’ సరికొత్త రికార్డ్.. మహేష్ ఫ్యాన్సా మజాకా..

Date : 12 August 2024 12:02 PM Views : 201

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Murari Re Release Record : ఇటీవల రీ రిలీజ్ సినిమాలు కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రీ రిలీజ్ సినిమాలకు కూడా భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ క్లాసిక్ హిట్ సినిమా మురారి రీ రిలీజ్ అయింది. దీంతో అభిమానులు అంతా థియేటర్స్ లో సందడి చేసారు. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల కంటే కూడా ఎక్కువగా మురారి లాంటి క్లాసిక్ సినిమాకి ఫ్యాన్స్ రచ్చ చేసారు. ఇప్పటికే థియేటర్స్ లో మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా వీడియోల రూపంలో వైరల్ గా మారాయి. కలెక్షన్స్ విషయంలో మురారి సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఒక్క రోజులోనే 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది మురారి సినిమా. ఇక రెండు రోజుల్లో 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇటీవల వచ్చే మీడియం రేంజ్ సినిమాలు కూడా రెండు రోజుల్లో ఇన్ని కలెక్షన్స్ సాధించట్లేదు. అలాంటిది మురారి సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించి ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. కలెక్షన్స్ కాకుండా ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ లో కూడా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. మురారి సినిమాకు ఆన్లైన్ బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయిన రోజు ఆగస్టు 3న ఆల్మోస్ట్ 41 వేల టికెట్స్ అముడయ్యాయి. సినిమా రిలీజ్ ముందు రోజు ఆగస్టు 8న 35 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. సినిమా రిలీజ్ రోజు ఆగస్టు 9న ఏకంగా 53 వేలకు పైగా టికెట్స్ అమ్ముడు పోయాయి. రీ రిలీజ్ తర్వాత రోజు ఆగస్టు 10 కూడా 28 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు బుక్ మై షోలో మొత్తం మురారి రీ రిలీజ్ కి ఏకంగా 2 లక్షల 57 వేలకుపైగా టికెట్స్ అమ్ముడుపోయి రీ రిలీజ్ టికెట్ బుకింగ్స్ లో కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. దీంతో మహేష్ ఫ్యాన్సా మజాకా అని ఆశ్చర్యపోతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :