Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Hebah Patel : చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే సినిమా ఇటీవల జూన్ లో థియేటర్స్ లో రిలీజయింది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో బాల రాజశేఖరుని దర్శకత్వంలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో పెళ్లి తర్వాత సమస్యలు వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే కథాంశంతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో కళ్యాణి మాలిక్ ఇచ్చిన సాంగ్స్ ప్రేక్షకులని మెప్పించాయి. థియేటర్ రన్ తర్వాత హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఆగస్టు 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో పర్వాలేదనిపించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమా ఇప్పటికే 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతుంది. మీరు కూడా మిస్ అయితే ఓటీటీలో ఈ సినిమా చూసేయండి.
Admin
Studio18 News