Thursday, 12 March 2026 04:12:08 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Vikram: చేసిన పొరపాటుకు 2 నెలలు ఏడుస్తూనే ఉన్నా: విక్రమ్

Date : 02 September 2024 02:11 PM Views : 350

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తమిళ స్టార్ విక్రమ్ నటించిన 'తంగలాన్' చిత్రం సూపర్ హిట్ అయింది. సినిమా సక్సెస్ వేడుకల్లో విక్రమ్ పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన కెరీర్ ఆరంభంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం చిత్రంలో ఒక్కసారైనా నటించాలని కలలు కనేవాడినని చెప్పారు. మణిరత్నంను, ఆయన ఫిల్మ్ మేకింగ్ ను తాను ఎంతో ఇష్టపడతానని తెలిపారు. అప్పట్లో తనకు 'బొంబాయి' సినిమా ఆఫర్ వచ్చిందని, తనను హీరోగా ఎంచుకున్నారని విక్రమ్ చెప్పారు. అయితే ఫైనల్ ఆడిషన్ లో తాను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం చేజారిందని తెలిపారు. తనను సడన్ గా ఆడిషన్ కు పిలిచారని... వీడియో కెమెరా కాకుండా స్టిల్ కమెరా తీసుకొచ్చి... సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారని చెప్పారు. అయితే మూమూలు కెమెరా తీసుకొచ్చి యాక్ట్ చేయమంటారేమిటి? ఎందుకు యాక్ట్ చేయాలి? అనిపించిందని... స్టిల్ కెమెరా కావడంతో తాను కదిలితే పిక్చర్ బ్లర్ గా వస్తుందని తాను భావించి అలాగే ఉండిపోయానని తెలిపారు. ఆ విధంగా ఆ సినిమా తన చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పొరపాటుకు తాను 2 నెలల పాటు ఏడుస్తూనే ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత 'బొంబాయి' సినిమా దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిందని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :