Sunday, 08 March 2026 04:23:51 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Kangana Ranaut: చంపేస్తామంటూ కంగ‌నా రనౌత్ కు బెదిరింపులు.. మూడు రాష్ట్రాల పోలీసుల‌కు ఫిర్యాదు!

Date : 27 August 2024 05:15 PM Views : 212

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్‌ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వ‌చ్చాయి. కొంద‌రు ఓ వీడియో ద్వారా ఈ మేర‌కు ఆమెపై బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దాంతో కంగన ఆ వీడియోను మ‌హారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఆమె కోరారు. అలాగే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌ను కూడా వీడియోకు ట్యాగ్ చేశారామె. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కంగ‌నా ర‌నౌత్‌ న‌టించిన తాజా చిత్రం 'ఎమ‌ర్జెన్సీ' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఇటీవ‌ల మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో కంగ‌న క‌నిపించ‌నున్నారు. ఇక కంగ‌నాను వీడియో ద్వారా బెదిరించిన వ్య‌క్తులు ఓ గ‌దిలో కూర్చుని ఉన్నారు. అందులో ఇద్ద‌రి వేష‌ధార‌ణ‌ మాత్రం నిహంగ్ సిక్కుల త‌ర‌హాలో ఉంది. ఒక‌వేళ ఆ సినిమా విడుద‌లైతే, అప్పడు దాన్ని ఖండిస్తామ‌ని స‌ద‌రు వ్య‌క్తులు వీడియోలో చెప్ప‌డం మ‌నం చూడొచ్చు. అలాగే ఓ వ్య‌క్తి మీ చిత్రాన్ని చెప్పుల‌తో కొడుతామ‌ని హెచ్చ‌రించ‌డం కూడా ఉంది. ఒక‌వేళ ఎమ‌ర్జెన్సీ సినిమాలో ఖ‌లిస్థానీ నేత జ‌ర్నెయిల్ సింగ్ భింద్రన్వాలేను ఉగ్ర‌వాదిగా చిత్రీక‌రిస్తే ఊరుకోబోమ‌ని వారు హెచ్చ‌రించారు. ఇందిరా గాంధీకి ఏం జ‌రిగిందో గుర్తు ఉంచుకోవాల‌ని బెదిరించారు. భింద్రన్‌వాలేను కొనియాడుతూ విక్కీథామ‌స్ సింగ్ అనే వ్య‌క్తి హెచ్చ‌రించ‌డం వీడియోలో క‌నిపించింది. ఇందిర‌ను హ‌త్య చేసిన బాడీగార్డులు స‌త్వంత్ సింగ్‌, బియాంత్ సింగ్ గురించి కూడా ఆ వ్య‌క్తి వీడియోలో ప్ర‌స్తావించ‌డం మ‌నం చూడొచ్చు. దీంతో ఈ వీడియోను కంగ‌న 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో షేర్ చేశారు. వీడియోను మ‌హారాష్ట్ర, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ పోలీసుల‌కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందిగా మ‌హారాష్ట్ర డీజీపీని కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :