Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Ram Charan RC16 Movie Update : రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి. ఈ సంవత్సరం లోపు ఎలాగైనా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టబోతున్నాడు చరణ్. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని సంగీత దర్శకుడు AR రహమాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్లయుద్ధం కథతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది.అలాగే రామ్ చరణ్ RC16 సినిమా కోసం గడ్డం, మీసం పెంచుతున్నాడని టాక్. చరణ్ పెంచే గడ్డం, మీసం కరెక్ట్ గా అనుకున్న లుక్ వస్తే బుచ్చిబాబు సెప్టెంబర్ నుంచే షూటింగ్ మొదలుపెడతాడని సమాచారం. ప్రస్తుతం చరణ్ భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. వెకేషన్ నుంచి రాగానే చరణ్ RC16 పని మీదే ఉంటారని, గేమ్ ఛేంజర్ లాగా ఈ సినిమా లేట్ చేయడని, వచ్చే సంవత్సరమే RC16 రిలీజ్ కూడా చేస్తారని తెలుస్తుంది. దీంతో చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ కంటే కూడా RC16 మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Admin
Studio18 News