Tuesday, 18 November 2025 03:39:41 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

Venkat Prabhu: 'ది గోట్' రిజ‌ల్ట్‌ తేడా కొట్ట‌డానికి కార‌ణం ఆ ఐపీఎల్ జ‌ట్టే: ద‌ర్శ‌కుడు వెంకట్ ప్రభు

Date : 10 September 2024 01:04 PM Views : 173

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : త‌మిళ‌ స్టార్ హీరో దళపతి విజయ్ న‌టించిన తాజా చిత్రం 'ది గోట్'. ఈ నెల 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. కానీ, తెలుగుతో పాటు బాలీవుడ్‌లో మాత్రం ఈ చిత్రం అంత‌గా అంచ‌నాల‌ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే గోట్‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వెంకట్ ప్రభు తాజాగా ఈ మూవీ ఫ‌లితంపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఆయ‌న కామెంట్స్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సినిమాలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ను హైలైట్ చేసే సీన్స్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని ఆయ‌న అన్నారు. అందుకే ఈ రెండు భాషల్లో గోట్‌ అంతగా ఆడలేదని తెలిపారు. ఇదే ఈ రెండు భాష‌ల్లో మూవీ వెన‌క బ‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణమ‌ని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో చాలా అతిథి పాత్ర‌లు ఉన్నాయి. ఇందులో భార‌త‌ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీని ఒక్క సీన్లోనైనా నటింప‌జేయాల‌ని అనుకున్నా అది సాధ్యపడలేదన్నారు డైరెక్ట‌ర్‌. ఆ కార‌ణంగానే ఐపీఎల్‌ విజువల్స్‌ ద్వారా ధోనీని స్క్రీన్ పై చూపించామని తెలిపారు. ఇలా ధోనీని హైలైట్ చేయ‌డం కూడా రెండు ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కులకు న‌చ్చ‌క‌పోయి ఉండొచ్చ‌ని వెంక‌ట్ ప్ర‌భు అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్లు కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఎంఎస్‌డీని హైలైట్ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం రాలేద‌న‌డం క‌రెక్ట్ కాద‌ని అభిమానులు చెబుతున్న మాట‌. ఇక ఈ సినిమాలో విజయ్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో 'డీ-ఏజింగ్‌' టెక్నాలజీ ఉప‌యోగించి హీరోను పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. విజ‌య్‌ స‌ర‌స‌న‌ మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ప్రశాంత్‌, వైభవ్‌, లైలా తదితరులు న‌టించారు. అటు కోలీవుడ్ స్టార్స్ శివ కార్తికేయన్, నటి త్రిష అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. యువన్ శంకర్ రాజా మూవీకి బాణీలు అందించ‌గా, ఏజీఎస్‌ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ‌ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :