Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas New Look : ప్రభాస్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సలార్, కల్కి సినిమాలతో హిట్స్ కొట్టి దూసుకుపోతున్నాడు. చేతిలో అరడజను పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత హను రాఘవపూడి సినిమా మొదలవుతుందని సమాచారం. ఇటీవల హను రాఘవపూడి సినిమా ఓపెనింగ్ లో కనపడ్డ ప్రభాస్ మళ్ళీ ఇప్పుడు కనపడ్డారు. తాజాగా శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, సత్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మత్తు వదలరా 2 సినిమా ట్రైలర్ ను ప్రభాస్ లాంచ్ చేసాడు. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా ప్రభాస్ వద్దకు వెళ్లారు. ప్రభాస్ మత్తు వదలరా 2 మూవీ టీమ్ తో మాట్లాడి ట్రైలర్ లాంచ్ చేసి టీమ్ ని అభినందించారు. ఈ క్రమంలో మత్తు వదలరా మూవీ టీమ్ తో ప్రభాస్ ఉన్న రెండు ఫొటోలను బయటకు రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫొటోలు బయటకు రావడంతో ఇవి వైరల్ గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో చూస్తుంటే ప్రభాస్ కొంచెం సన్నబడ్డాడు అని అనిపిస్తుంది. ఇటీవల ప్రభాస్ సినిమాల్లో గంభీరంగా మంచి బాడీతో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ఫొటోల్లో కొంచెం సన్నగా కనిపించడంతో సినిమా కోసం ప్రభాస్ సన్నబడ్డాడా అని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ఏదైతే ఏముంది ప్రభాస్ ఫొటోలు అయితే బయటకు వచ్చాయి అని పలువురు ఫ్యాన్స్ వీటిని తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ప్రభాస్ ఫోటోల వైపు ఒక లుక్ వేసేయండి..
Admin
Studio18 News