Sunday, 08 March 2026 10:49:28 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Kalinga Movie : మా సినిమాలో అమ్మవారిని చూపించిన విధానం అందరికి నచ్చింది.. ‘కళింగ’ టీమ్..

Date : 16 September 2024 01:11 PM Views : 358

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kalinga Movie : ధృవ వాయు ఇటీవలే కళింగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా నటిస్తూ తనే కళింగ సినిమాకు దర్శకత్వం వహించాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా ప్రగ్య నయన్ హీరోయిన్ గా, ఆడుకాలం నరేన్, సంజయ్ కృష్ణ, లక్ష్మణ్ మీసాల, మురళీధర్ గౌడ్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా వచ్చింది. కళింగ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులని బాగానే భయపెట్టింది. హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో పాటు డివోషనల్ టచ్ కూడా ఇచ్చి ప్రేక్షకులని మెప్పించారు. తాజాగా కళింగ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. కళింగ సక్సెస్ మీరు లో హీరో, డైరెక్టర్ ధృవ వాయు మాట్లాడుతూ.. ఇప్పుడు సినిమాలకు ఉన్న పరిస్థితుల్లో నాలాంటి కొత్త వ్యక్తి వచ్చి సినిమా తీయడం, హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. వర్డ్‌ ఆఫ మౌత్ తో మా సినిమా అందరికీ చేరువ అవుతోంది. మా సినిమాలో విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ చూపించారు. మా సినిమాని ఆదరిస్తున్నందుకు ఆడియెన్స్‌కు ధన్యవాదాలు అని అన్నారు. నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. కళింగ సినిమా మీద మా డైరెక్టర్ ముందు నుంచి నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకమే ఇప్పుడు విజయం తీసుకొచ్చింది. టెక్నికల్‌గా మూవీ చాలా బాగుందని అందరూ అంటున్నారు అని తెలిపారు. హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. సినిమా చూసాక అందరూ నన్ను సినిమాలోని క్యారెక్టర్ పేరు పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడేళ్లుగా ఈ సినిమా కోసం పని చేశాను. ఇవాళ సక్సెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :